Taliban in Panjshir: పంజ్‌షీర్ ప్రజలపై పగ తీర్చుకుంటున్న తాలిబన్లు

* పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ప్రజలపై తాలిబన్ల దాడులు * ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన ప్రతిఘటన దళం

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 9:01 PM IST
The Taliban Taking Revenge on the People of Panjshir
X

పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ప్రజలపై తాలిబన్ల దాడులు

Taliban in Panjshir: పంజ్‌షీర్ ప్రజలపై తాలిబన్ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇన్నాళ్లూ కొరకరాని కొయ్యగా తయారైన పంజ్‌షీర్‌ను ఎట్టకేలకు ఆక్రమించిన తాలిబన్లు ఇప్పుడా కోపాన్నంతా అక్కడి ప్రజలపై చూపిస్తున్నారు. దీంతో తాలిబన్ల ఊచకోతలు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలను కోరుతూ పంజ్‌షీర్ ప్రతిఘటన దళం లేఖ రాసింది. పంజ్ షీర్ ప్రావిన్స్ లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులు చేస్తున్నారని, ఊచకోత కోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్ల ఆగడాలకు సరిహద్దుల్లో పడి ఉన్న ప్రజల మృతదేహాలే నిదర్శనమని తెలిపింది. వెంటనే ఊచకోతలను ఆపాల్సిందిగా తాలిబన్లకు చెప్పాలంటూ ఐరాసను లేఖలో కోరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story