Afghanistan: కాబూల్ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసిన తాలిబన్లు

*ఎయిర్ పోర్టుకు దారి తీసే రహదారులన్నింటి మూసివేత * ఎయిర్ పోర్టు రహదారులపై సాయుధ బలగాల పహారా

Sandeep Reddy
Updated on: 25 Aug 2021 4:00 PM IST
The Taliban Blocked the City of Kabul in Afghanistan
X

కాబూల్ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసిన తాలిబన్లు (ఫైల్ ఫోటో)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో ని కాబూల్ ను తాలిబన్లు అష్ట దిగ్బంధనం చేశారు. నగరాన్ని నలువైపులనుంచి దిగ్బంధించారు. ఆప్ఘన్ పౌరులెవరూ దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టుకు ఎవ్వరూ వెళ్లకుండా రోడ్లన్నింటినీ మూసివేశారు. కాబూల్ ఎయిర్ పోర్టుకు వెళుతున్న ఓ ఆస్ట్రేలియా కుటుంబాన్ని అడ్డగించి చితకబాదారు. ఆ కుటుంబంపై ఇష్టానుసారం దాడులు చేశారు. రక్తమోడుతున్న ఆస్ట్రేలియా పౌరులు కాబూల్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించారు.

మరోవైపు పంజ్ షిర్ లోనూ తాలిబాన్ల ఆగడాలు కొనసాగుతాయి. మసూద్ నేతృత్వంలోని ఆప్ఘన్ సైన్యం మిలటరీ పెరేడ్ నిర్వహిస్తూ స్థానికుల్లో ధైర్యం నింపుతోంది.కానీ పరిస్థితి మొన్నటి మీద క్షీణించినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అన్నివిధాలా చితికిపోయిన పౌరులు తాలిబన్లకు లొంగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story