Brazil Plane Crash: బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం..62 మంది దుర్మరణం

Brazil Plane Crash: ఈమధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న నేపాల్లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. తాజాగా బ్రెజిల్ లోనూ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 62 మది మరణించారు.

Dhivi
Updated on: 10 Aug 2024 10:10 AM IST
The plane crashed in Brazil.. 62 people died
X

 Plane CRASH : బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం..62 మంది దుర్మరణం

Brazil Plane Crash: బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. సావో పువాలోని నివాసప్రాంతమైన విన్ హెడలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం సావో పువాలోని అంతర్జాతీయ విమానాశ్రాయానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంపై అధ్యక్షుడు లుయూజ్ లువా డసిల్వా విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగే వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది బ్రుందాలు రెస్య్కూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరగడంతో పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. విమానం కుప్పకూలుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.



Dhivi

Dhivi

Next Story