ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్..

The Monkeypox Virus is Causing a Around the World
x

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్..

Highlights

Monkeypox: మంకీ పాక్స్ వైరస్ బారిన పడిన 22 ఏళ్ల కేరళ యువకుడు శనివారం మృతి చెందాడు

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్ ఇప్పుడు మన దేశంలోనూ ఆందోళనకు కారణమైంది. మంకీ పాక్స్ వైరస్ బారిన పడిన 22 ఏళ్ల కేరళ యువకుడు శనివారం మృతి చెందాడు. నిజానికి ఆయన పది రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు రాగా అప్పటికే మంకీ పాక్స్ సోకి ఉందని, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపామని, మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఇది మంకీ పాక్స్ కారక మరణమేనని అధికారికంగా ప్రకటించకపోయినా దేశంలో ఇదే తొలి మంకీ పాక్స్ మృతిగా పేర్కొంటున్నారు.

జులై 21 తేదీన యూఏఈ నుంచి 22 ఏళ్ల యువకుడు కేరళలోని త్రిసూర్‌ కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో 27వ తేదీన స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మంకీ పాక్స్ లక్షణాలేమీ లేకపోవడంతో వైద్యులు సాధారణ చికిత్సలే అందించారు. అలా చికిత్స పొందుతూనే ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మరణించారు. కానీ ఆ యువకుడు యూఏఈలో ఉన్నప్పుడే జులై 19వ తేదీనే మంకీ పాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. ఆ రిపోర్టును కూడా వైద్యులకు ఇవ్వడంతో కలకలం మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories