Viral News: అతనికి 8 మంది భార్యలు.. ఒకే ఇంట్లో కాపురం..

Viral News: థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు.

Arun Chilukuri
Published on: 2 Feb 2022 1:16 PM IST
Thailand Man Shares Single Home With 8 Wives
X

Viral News: అతనికి 8 మంది భార్యలు.. ఒకే ఇంట్లో కాపురం..

Viral News: థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. వారందర్నీ ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేస్తున్నాడు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ వైవాహిక జీవితం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. థాయ్‌లాండ్‌లో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు ఓంగ్ డామ్. ఇతను వివిధ సందర్భాల్లో 8 మంది అమ్మాయిలను చూసి మనసు పారేసుకుని వారిని పెళ్లి చేసుకున్నాడు.

మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో చూసి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్యను మార్కెట్‌లో, మూడో భార్యను హాస్పిటల్‌లో చూసి మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత నాలుగు, ఐదు, ఆరో భార్యలను సోషల్ మీడియాలో చూసి ప్రేమలో పడ్డాడు. ఏడో భార్యను ఓ గుడిలో చూసి పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి తన నలుగురు భార్యలతో కలిసి విహార యాత్రకు వెళ్లినపుడు అక్కడ ఓ అమ్మాయి నచ్చడంతో ఆమెను ఎనిమిదో భార్యగా చేసుకున్నాడు. ఓంగ్‌ ఇంట్లో నాలుగు పడక గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున కాపురం చేస్తున్నాడు. ఓంగ్ ధనవంతుడేమి కాదు. అయినా అతడి భార్యలందరూ అతనితో నివసిస్తున్నారు కానీ వారందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కలిసి జీవించడం విశేషం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story