మలేషియాలో చిక్కుకున్న తెలంగాణ యువకులకు విముక్తి

* ఎంపీ అరవింద్‌కు ఋణపడి ఉంటామన్న యువకులు

R Tripura Malini
Published on: 12 Dec 2022 10:42 AM IST
Telangana Youth Trapped In Malaysia Freed
X

మలేషియాలో చిక్కుకున్న తెలంగాణ యువకులకు విముక్తి

Malaysia: ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ, హెచ్‌ఎం టీవీ కథనానికి మలేషియా, ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించారు. దీంతో మలేషియాలో చిక్కుకున్న తెలంగాణ యువకులకు విముక్తి కలిగింది. 80 మంది యువకులు మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి నిజామాబాద్‌తో పాటు వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. కాగా తమ బాధలను ప్రసారం చేసిన హెచ్ఎం టీవీకి యువకులు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ అర్వింద్‌కు ఋణపడి ఉంటామన్నారా యువకులు ఎంపీ అర్వింద్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి తమను ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీంతో కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రాంత వాసులను స్వదేశానికి అధికారులు పంపారన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story