జారి పడ్డ చిన్నారిని క్యాచ్ పట్టిన యువకుడు.. వీడియో వైరల్

Arun Chilukuri
Updated on: 12 May 2025 10:29 AM IST
జారి పడ్డ చిన్నారిని క్యాచ్ పట్టిన యువకుడు.. వీడియో వైరల్
X

చిన్నారి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు ఓ యువకుడు. భవనంపై నుంచి కిందపడుతోన్న చిన్నారిని రెండు చేతులతో క్యాచ్‌ పట్టుకొని ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. టీనేజర్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో దోహా మహ్మద్ అనే చిన్నారి అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో ఆడుకుంటోంది. ఆ క్రమంలో రెండో అంతస్తులోని కిటీకి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న యువకుడు చిన్నారిని చేతులతో పట్టుకొని ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో సీసీ టీవీలో రికార్డు అవ్వడంతో ఒక్కసారిగా టీనేజర్‌ హీరో అయ్యాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story