అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తానా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కూమార్తెలు మృతి..

USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 27 Sept 2022 12:49 PM IST
TANA Board Director’s Wife, Daughters Killed in Accident in Texas
X

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తానా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కూమార్తెలు మృతి..

USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని వాలర్‌ కౌంటీ వద్ద జరిగిన ఈ ఘటనలో తానా బోర్డు సభ్యుడు డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. శ్రీనివాస్ భార్య వాణి కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. తర్వాత పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్ గా పనిచేస్తూ హ్యూస్టన్ లో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యునిగా సేవలు అందిస్తున్న ఆయన.. డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story