Taliban: తాలిబన్లు చెప్పే దొకటి.. చేసేదొకటి

Taliban: తొలి మహిళా గవర్నర్ సలీమా ఫాతిమాను అదుపులోకి తీసుకున్న తాలిబన్లు * కనిపించని సలీమా మజారీజాడ

Sandeep Eggoju
Updated on: 18 Aug 2021 6:29 PM IST
Talibans Detained the First Woman Governor Salima Fathima
X

తాలిబన్లు (ఫైల్ ఇమేజ్)

Taliban: అధికారం చేజిక్కించుకుని 24 గంటలు గడవ కుండానే తాలిబన్ల నిజ స్వరూపం బట్టబయలవుతోంది. ప్రజలెవ్వరూ భయపడొద్దని, ప్రశాంతంగా , ధైర్యంగా బతకొచ్చని చెప్పిన తాలిబన్లు ఆచరణలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మహిళలు కూడా అధికారంలో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పిన నేతలు, తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీ ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఆమె ఎక్కడున్నదీ తెలీడం లేదు తాలిబన్లు చొరబడుతున్న క్రమంలో స్థానికులంతా దేశం వదిలిపోతున్నా సలీమా మాత్రం అక్కడే ఉండిపోయారు.. మరోవైపు వీధుల్లో కలియతిరుగుతున్న తాలిబన్లు

దొంగతనం ఆరోపణలు నెట్టి అమాయకులను ఇష్టానుసారం కొడుతున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం నలుగురు మహిళలు ధైర్యంగా బహిరంగ నిరసనకు దిగారు కాబూల్ వీధుల్లో ఈ నలుగురు ఆఫ్ఘన్ మహిళలు చేతితో రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ హక్కులు వృథాగా పోకూడదని నినదిస్తున్నారు చిత్రమేమంటే వారు నిరసనలు తెలుపుతున్న సమయంలో వారి చుట్టూ తాలిబన్లు చుట్టుముట్టే ఉన్నారు.. జలాలాబాద్ లో ఎదురుతిరిగిన వారిపై కాల్పులకు తెగబడినట్లు సమాచారం


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story