Israel Palestine War: ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్

Israel-Palestine War: ఇజ్రాయెల్ ఆర్మీపై సిరియా సైన్యం కాల్పులు

Shekhar G
Updated on: 12 Oct 2023 3:15 PM IST
Syrian Army Fire On Israeli Army
X

Israel Palestine War: ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్

Israel Palestine War: ఇజ్రాయెల్ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. ఇటు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు .. మరోవైపు లెబనాన్, సిరియా నుంచి ప్రతిఘటనలు తప్పడం లేదు . ఇరాన్ మద్దుతగా ఉన్న హిజ్బుల్లా బుధవారం మరోసారి లెబనాన్ వైపు నుంచి క్షిపణలు ప్రయోగించింది. ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామమైన దుహారాలో గైడెడ్ క్షిపణులతో దాడి చేసింది. ఒక ట్యాంక్ ను పేల్చివేసింది. ఇజ్రాయెల్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది.

ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో తమ వారిని కోల్పోవడంతో ప్రతిస్పందనగా క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది. తమ దేశ ప్రజలు,సెక్యూరిటీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే తగిన విధంగా బదులిస్తామని హిజ్బుల్లా హెచ్చరించింది.మరోవైపు సిరియా సైన్యం సరిహద్దు నుంచి ఇజ్రాయెల్ ఆర్మీపై కాల్పులు జరుపుతున్నది. బాంబు షెల్స్ ప్రయోగిస్తున్నది. దీంతో ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడ కూడా ప్రతి దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరోసారి మూడు దేశాల సరిహద్దుల్లో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది.

Shekhar G

Shekhar G

Next Story