Sydney Lockdown: పౌరుల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఆస్ట్రేలియా

Sydney Lockdown
x

Sydney Lockdown: పౌరుల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఆస్ట్రేలియా

Highlights

Sydney Lockdown: "ఫ్రీడం", అన్‌మాస్క్ ది ట్రూత్" నినాదంతో ఆస్ట్రేలియా అట్టుడికిపోతోంది.

Sydney Lockdown: "ఫ్రీడం", అన్‌మాస్క్ ది ట్రూత్" నినాదంతో ఆస్ట్రేలియా అట్టుడికిపోతోంది. కోవిడ్ ఆంక్షల పొడిగింపుతో ఆందోళనలు మిన్నంటాయి. సిడ్నీ సహా అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రోడ్లపై బారికేడ్లను తోసేసి, ప్లాస్టిక్ సీసాలను, మొక్కలను విసిరేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిడ్నీలోని విక్టోరియా పార్క్ నుంచి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని టౌన్‌హాల్ వరకు పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కనీస కోవిడ్ నిబంధనలు పాటించక పోవడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి ప్లాస్టిక్ సీసాలు, ఇతర వస్తువులను విసరడంతో అనేక మందిని అరెస్టు చేశారు. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత సమావేశం హక్కులను తాము గౌరవిస్తామని న్యూసౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. ప్రజలందరి భద్రత, రక్షణకే తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories