London: లండన్‌లో భారతీయ యువతిపై కత్తితో దాడి

London: నెలరోజుల క్రితం లండన్ వెళ్లిన యువతి సోనాబిజు

Rama Rao
Published on: 31 March 2022 1:17 PM IST
Sword Attack on an Indian woman in London | Telugu News
X

London: లండన్‌లో భారతీయ యువతిపై కత్తితో దాడి

London: లండన్‌లో భారతీయ యువతిపై కత్తితో దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితమే లండన్ వెళ్లిన యువతి సోనాబిజు కేరళకు చెందిన అమ్మాయి. యువతి ఈస్ట్‌ లండన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఈస్ట్ హోమ్‌లోని హైదరాబాదీ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పార్టైమ్ జాబ్ చేస్తుంది.

దాడి చేసిన వ్యక్తి శ్రీరామ్ అంబర్‌లాగా గుర్తించారు. వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నిందితుడ్ని థేమ్స్ మెజిస్ట్రేట్ కోర్టులో మెట్రోపాలిటన్ పోలీసులు హాజరుపర్చగా ఏప్రిల్ 25 వరకు కస్టడీ విధించింది కోర్టు.

Rama Rao

Rama Rao

Next Story