Texas floods: టెక్సస్ వరద ప్రవాహంలో 32 కిమీ కొట్టుకొచ్చి బతికిన మృత్యుంజయురాలు

Texas floods: అమెరికాలోని టెక్సాస్‌లో వచ్చిన వరద అల్లకల్లోలం సృష్టించింది. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే నీళ్లలో కొట్టుకుపోయారు. కారులో ఉన్నవాళ్లు కార్లతోనే నీటి ప్రవాహానికి బలైపోయారు.

Indira Ram
Published on: 8 July 2025 9:00 PM IST
Texas floods
X

Texas floods: టెక్సస్ వరద ప్రవాహంలో 32 కిమీ కొట్టుకొచ్చి బతికిన మృత్యుంజయురాలు

Texas floods: అమెరికాలోని టెక్సాస్‌లో వచ్చిన వరద అల్లకల్లోలం సృష్టించింది. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే నీళ్లలో కొట్టుకుపోయారు. కారులో ఉన్నవాళ్లు కార్లతోనే నీటి ప్రవాహానికి బలైపోయారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా సరిగ్గా లెక్కించడానికి కూడా కుదరడం లేదు. ఎంతమంది గల్లంతయ్యారో కూడా తెలియడం లేదు. కానీ టెక్సాస్ వరదల సమయంలో ఒక మహిళ మాత్రం ఏకంగా 32 కిమీ నీటిలో కొట్టుకుపోయి.. బతికి మృత్యుంజయరాలిగా మిగిలింది. వివరాలు తెలుసుకుందాం.

అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా అమెరికాలోని టెక్సాస్ నగరం అతలాకుతలమైపోయింది. నదులు పొంగి పొర్లడంతో వరదలు ఒక్కసారిగా ఊరిని ముంచేసాయి. ఆ సమయంలో నిద్రపోతున్న ఒక మహిళ ఆ నీటిలోనే దాదాపు 32 కిమీ కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఒక చెట్టు దగ్గర చిక్కుకోవడంతో నెమ్మదిగా ఆ చెట్లు ఎక్కి కొమ్మపై కూర్చుంది. ఆ తర్వాత ఆమెను గుర్తించి కాపాడామాని రిస్య్యూ సిబ్బంది వెల్లడించారు.

టెక్సాస్‌లో వరదలు వచ్చిన సమయంలో ఒక మహిళ తన కుటుంబంతో కలిసి క్యాంపింగ్‌లో ఉంది. సెలవులు కావడంతో కుటుంబం అంతా సరదాగా ఎంజాయ్ చేద్దామని క్యాంపింగ్ వచ్చారు. అయితే అందరూ నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా వరద నీరు ముంచెత్తింది. దీంతో వరద ప్రవాహంలో అందరూ కొట్టుకుపోయారు. విచిత్రం ఏంటంటే ఆ సమయంలో ఆమె గాధ నిద్రలో ఉండిపోవడం వల్ల కాసేపటి వరకు ఆమెకు ఏం జరిగిందో తెలియలేదు. ఒకసారి కళ్లు తెరిచి చూస్తే నీళ్లలో కొట్టుకుపోతుంది. అలా కొన్ని గంటలపాటు నీళ్లలో కొట్టుకుపోయింది.

కనుచూపు మేర అంతా నీళ్లే. ఒక ఇల్లు లేదు. కాపాడే సిబ్బంది లేరు. అలా నీళ్లలో ఆమె కొట్టుకుపోతూనే ఉంది. అలా దాదాపు 32 కిమీ నీటి ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఒక చెట్టు దగ్గరకు వచ్చి చిక్కుకుపోయింది. వెంటనే ఆ చెట్టును పట్టుకుని నెమ్మదిగా పైకి ఎక్కి కూర్చుంది. అయితే తనని కాపాడడానికి ఎవరైనా వస్తారేమో అని కొన్ని గంటల పాటు ఎదురుచూస్తుంది. చివరకు చెట్టుపైన మహిళ కూర్చుని ఉండడాన్ని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు.

అయితే ఈ ప్రవాహంలో కొట్టుకుపోయిన తన కుటుంబ సభ్యుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. ఇంకా వారికోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. తన కుటుంబం మొత్తం నీటిలో మునిగిపోయిందని.. తాను ఒక్కర్దానే ఉన్నానని ఆమె బోరున విలపిస్తుంది.

ఇదిలాఉండగా టెక్సాస్‌లో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వెళుతుంది. లెక్కల ప్రకారం 82 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో కొట్టుకుపోయిన వేసవి శిబిరాల్లో ఎంతోమంది చిన్నారులు ఉన్నారు. వారి జాడ ఇంకా తెలియడం లేదు.

Indira Ram

Indira Ram

Next Story