ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా... కోర్టులో శృంగార తార సాక్ష్యం..

Stormy Daniels: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్‌ పేర్కొన్నారు.

Arun Chilukuri
Updated on: 8 May 2024 8:30 PM IST
Stormy Daniels Tells Story of Sex With Trump
X

ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా... కోర్టులో శృంగార తార సాక్ష్యం..

Stormy Daniels: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు సైతం ఇచ్చారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు.

2011లో ఈ విషయం బయటకు వచ్చిందని వాంగ్మూలంలో తెలిపారు. 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల నగదుని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి అందుకున్నట్లు స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. అయితే, ట్రంప్‌ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. స్టార్మీ డేనియర్ ఆరోపణలను ట్రంప్‌ తరఫున న్యాయవాదులు ఖండించారు. కేవలం డబ్బుల కోసమే ట్రంప్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

2006లో లేక్ తాహో సెలబ్రెటీ గోల్ఫ్ ఔటింగ్ లో ట్రంప్‌ను తొలిసారి కలిశా అని స్టార్మీ డేనియల్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆమెను హోటల్ లో డిన్నర్ కు ఆహ్వానించారని అన్నారు. ఆ తర్వాత హోటల్‌ సూట్‌కు తీసుకెళ్లారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైందని తెలిపారు. అక్కడ ఇద్దరూ సన్నిహితంగా గడిపామని తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయినప్పటికీ సన్నిహితంగా మెలగలేదని.. తమ సంబంధం గురించి ఎంతోమందికి తెలుసు అని డేనియల్‌ వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story