Baltimore Bridge Collapse: అమెరికా వంతెన ప్రమాదం.. ఆరుగురి మృతి!

Baltimore Bridge Collapse: బ్రిడ్జి కూలిన ఘటనలో సహాయక చర్యలు

Jyothi
Published on: 27 March 2024 8:27 AM IST
Six Presumed Dead After Baltimore Bridge Collapse
X

Baltimore Bridge Collapse: అమెరికా వంతెన ప్రమాదం.. ఆరుగురి మృతి!

Baltimore Bridge Collapse: అమెరికాలో బ్రిడ్జి కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాల్టిమోర్‌లో ఓ కంటెయినర్‌ ఓడ..నదిలో స్టీల్‌ వంతెనను ఢీ కొట్టగా బ్రిడ్జి పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వంతెనపై ప్రయాణిస్తున్న కార్లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్లు సమాచారం. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పటాప్‌స్కో నదిలో బాల్టిమోర్‌ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతున్న కంటెయినర్ ఓడ, మార్గమధ్యలో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ వంతెనను ఢీ కొట్టింది. నదిలో పడిన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. కార్లలో గల్లంతైన వారు కచ్చితంగా ఎంతమందో తెలియదని చెప్పిన అగ్నిమాపక సిబ్బంది...మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వంతెన కూలిపోవడం వల్ల బాల్టిమోర్‌ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించగా, అధికారులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Jyothi

Jyothi

Next Story