America: అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు..

America: ఇద్దరి మధ్య పరస్పరం కాల్పులు

Dhatripriya
Published on: 27 March 2023 10:46 AM IST
Shooting At Gurudwara In California
X

America: అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు..

America: అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో కౌంటీలో ఉన్న గురుద్వారా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. అయితే ఇవి విద్వేషపూరితంగా జరిగిన కాల్పులు కావని పోలీసులు స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story