Shehbaz Sharif: పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌.. వరుసగా రెండోసారి

Shehbaz Sharif: పార్లమెంట్‌లో పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ కూటమికి 201 మంది మద్దతు

Jyothi
Published on: 3 March 2024 3:40 PM IST
Shehbaz Sharif Becomes Pakistan PM for a Second Time
X

Shehbaz Sharif: పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌.. వరుసగా రెండోసారి

Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు 16 నెలల పాటు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్‌ రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యాడు. పార్లమెంట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో PMLN, PPP కూటమికి 201 మంది మద్దతు ఇచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఉమర్ అయూబ్‌ నిలబడగా.. 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో షెహబాజ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. రేపు అధ్యక్ష భవనంలో ప్రధానిగా షెహబాజ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story