Sanket Jayesh Balsara: న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా భారతీయుడు

Sanket Jayesh Balsara: 2017 నుంచి న్యూయార్క్ కోర్టులో మేజిస్ట్రేటుగా పనిచేస్తున్న బల్సారా

Shekhar G
Published on: 11 Feb 2024 1:04 PM IST
Sanket Jaysukh A Person Of Indian Descent As A New York District Judge
X

Sanket Jayesh Balsara: న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా భారతీయుడు 

Sanket Jayesh Balsara: న్యూయార్క్‌లోని అమెరికా ఈస్టర్న్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్‌ జయేశ్‌ బల్సారా నియమించబడ్డాడు. ఈ మేరకు వైట్‌హౌస్‌ అధికారిక ప్రకటన చేసింది. బల్సారా 2017 నుంచి ఇదే కోర్టులో మేజిస్ట్రేటుగా పనిచేస్తున్నారు. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆయనే. ఇప్పుడు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బల్సారా తండ్రి న్యూయార్క్‌ నగర పాలికలో ఇంజినీరుగా పనిచేయగా, తల్లి నర్సుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ భారత్‌, కెన్యాల నుంచి 50 ఏళ్ల క్రితం వలస వెళ్లారు.

Shekhar G

Shekhar G

Next Story