Russian Social Media Star Marries Her Stepson: కొడుకును పెళ్లాడిన సోష‌ల్ మీడియా స్టార్‌

Russian Social Media Star Marries Her Stepson: ప్రేమ.. హృదయ స్పందన. ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో తెలియదు.. ఎవరు ఎవరితో ప్రేమలో పడతారో కూడా అర్ధం కాదు.. అలా ఓ వ్యక్తి తల్లిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

Raj
By Raj
Published on: 15 July 2020 8:36 PM IST
Russian Social Media Star Marries Her Stepson:  కొడుకును పెళ్లాడిన సోష‌ల్ మీడియా స్టార్‌
X

Russian Social Media Star Marries Her Stepson: ప్రేమ.. హృదయ స్పందన. ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో తెలియదు.. ఎవరు ఎవరితో ప్రేమలో పడతారో కూడా అర్ధం కాదు.. అలా ఓ వ్యక్తి తల్లిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే నిజానికామె సొంత తల్లి కాదు.. పెంచిన తల్లి. వివరాల్లోకి వెళితే.. ర‌ష్యాలోని 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ సోష‌ల్ మీడియా స్టార్‌ గా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు కూడా ఉన్నారు. అయితే ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాను వివాహం చేసుకున్నానని అందులో వెల్లడించారు. అయితే ఆమె పదేళ్ల కిందటే అలెక్స్‌ ఆరే అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేరు, దాంతో వీరు ఐదుగురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్నారు.

అయితే పదేళ్ల తరువాత ఆ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.. దాంతో ఇద్దరు విడిపోయారు.. ‌ విడిపోయిన త‌ర్వాత పిల్లల బాధ్య‌త కోర్టు క‌న్న‌తండ్రికే అప్పగించింది. ఈ క్ర‌మంలో ఆమె పెంపుడు కొడుకైన ఇర‌వయ్యేళ్ల వ్లాదిమిర్‌ వోయాతో ప్రేమ‌లో ప‌డ్డారు. ఇద్దరి మ‌న‌సులు ఒక్క‌ట‌య్యాయి. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకోవాలని అనుకున్నా.. క‌రోనా రావ‌డంతో పెళ్లి వాయిదా ప‌డింది. అయితే గ‌త‌వారం ఈ ఇద్దరు రిజిస్ట్రర్ ఆఫీసులో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు.

Raj

Raj

Next Story