బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జుయిన బస్సు, 17 మంది దుర్మరణం

Bangladesh: డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సమాచారం

Dhatripriya
Updated on: 19 March 2023 6:53 PM IST
Road Accident In Bangladesh
X

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జుయిన బస్సు, 17 మంది దుర్మరణం

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయి ఓ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌ వేపై అదుపుతప్పి కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది. కాలువ గోడను ఢీకొని ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని... స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఓవర్ స్పీడ్‌కు బస్సు టైర్ పగిలిపోయిందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కాలువలో పడిపోయిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story