Rishi Sunak: టీవీ డిబేట్‌లో రిషి సునాక్‌ అనూహ్య విజయం..

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో కొత్త ప్రధాని ఎవరన్న దానిపై కసరత్తు జరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 8:01 PM IST
Rishi Sunak Scores Surprise Debate Win Over Rival Liz Truss
X

Rishi Sunak: టీవీ డిబేట్‌లో రిషి సునాక్‌ అనూహ్య విజయం.. 

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో కొత్త ప్రధాని ఎవరన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ప్రధాని రేసులో భారత సంతతి నేత రిషి సునాక్ మొదట్లో జోరు కనబర్చినా, ఆ తర్వాత లిజ్ ట్రస్ ధాటికి వెనుకబడ్డారు. అయితే, ఓ టీవీ చర్చ కార్యక్రమంలో లిజ్ ట్రస్ పై సునాక్ ఆశ్చర్యకర విజయం సాధించారు.

స్కై న్యూస్ చానల్ నిర్వహించిన డిబేట్లో ఆడియన్స్ లో అత్యధికులు కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరిచారు. ఆ చానల్ డిబేట్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ పాడైపోవడంతో, వారంతా చేతులు పైకెత్తి సునాక్ కు మద్దతు పలికారు. ఒపీనియన్ పోల్స్ లో చాలావరకు లిజ్ ట్రస్ వైపు మొగ్గుచూపుతుండగా, చానల్ స్టూడియోలో ప్రేక్షకులు రిషి సునాక్ కు ఓటేయడం బ్రిటన్ రాజకీయ వర్గాలను కూడా విస్మయానికి గురిచేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story