కాప్-27 సదస్సులో గందరగోళం.. సదస్సు మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన రిషి సునాక్

COP27 Event: సీరియస్‌గా జరుగుతున్న మీటింగ్‌ నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అంతే సీరియస్‌గా లేచివెళ్లిపోవడం ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

Arun Chilukuri
Published on: 8 Nov 2022 5:45 PM IST
Rishi Sunak Rushed Out Of COP27 Event
X

కాప్-27 సదస్సులో గందరగోళం.. సదస్సు మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన రిషి సునాక్ 

COP27 Event: సీరియస్‌గా జరుగుతున్న మీటింగ్‌ నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అంతే సీరియస్‌గా లేచివెళ్లిపోవడం ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈజిప్ట్‌లో నిర్వహిస్తున్న వాతావరణ మార్పుల సదస్సు కాప్ 27 లో వేదికపై ఉన్న రిషి అంతలోనే తన సిబ్బందితో కలిసి మీటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రధాని అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చిన రిషి ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్ 27 మీటింగ్‌కు హాజరయ్యారు.

అయితే వేదికపై కూర్చున్న సమయంలో ఓ వ్యక్తి రిషి చెవిలో ఏదో చెప్పాడు. అంతలోనే రిషి అక్కడి నుంచి హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో అసలు సదస్సులో ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం నెలకొంది. రిషి బయటకు వెళ్లే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ మీటింగ్‌కు హాజరయ్యేది లేదని రిషి ప్రకటించారు. కానీ అంతలోనే తన మనస్సు మార్చుకుని సదస్సుకు హాజరయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story