logo
ప్రపంచం

Australia: పార్లమెంట్ బిల్డింగ్‌కు నిప్పు పెట్టిన నిర‌స‌న‌కారులు

Protesters set fire to Australias Old Parliament House
X

Australia: పార్లమెంట్ బిల్డింగ్‌కు నిప్పు పెట్టిన నిర‌స‌న‌కారులు

Highlights

Australia: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు.

Australia: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. క్యాన్బెరాలో ఉన్న పాత పార్లమెంట్ భవన తలుపులు ఆ మంటల్లో దగ్ధం అయ్యాయి. ఓ నిరసన ప్రదర్శన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రాచీన తెగలకు చెందిన జాతుల వారు తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పార్లమెంట్ భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనను ప్రధాని స్కాట్ మారిసన్ ఖండించారు. ఆస్ట్రేలియన్లు ఇలా ప్రవర్తిస్తారని అనుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ కు నిప్పు పెడుతారా అని ఆయన ప్రశ్నించారు.

Web TitleProtesters set fire to Australia's Old Parliament House
Next Story