బ్రిటన్ రాజరికం వదులకున్న హ్యారీకి కొత్త చిక్కులు

Prince Harry: బ్రిటన్ రాజరికాన్ని వదులుకున్న యువరాజు హ్యారీకి కొత్త చిక్కులు వచ్చాయి.

Arun Chilukuri
Published on: 17 Jan 2022 4:15 PM IST
Prince Harry Files Court Claim Over UK Police Protection
X

బ్రిటన్ రాజరికం వదులకున్న హ్యారీకి కొత్త చిక్కులు 

Prince Harry: బ్రిటన్ రాజరికాన్ని వదులుకున్న యువరాజు హ్యారీకి కొత్త చిక్కులు వచ్చాయి. కుటుంబ భద్రత కోసం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అమెరికాకు చెందిన మాజీ నటి మేఘన్ మార్కెల్ ను వివాహం చేసుకుని హ్యారీ రాజరికాన్ని వదులుకున్నాడు. రాజరికం వదులుకున్న హ్యారీ కుటుంబం బ్రిటన్ పర్యటనకు వస్తే స్థానిక పోలీసుల రక్షణ ఉండదని, ఖర్చు తనే భరించినా సాధ్యం కాదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హ్యారీ కోర్టులో సవాల్ చేశారు.

హ్యారీ కుటుంబం ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటుంది. హ్యారీ కుటుంబం బ్రిటన్ పర్యటనకు వెళితే భద్రత ఎలా అనేది తెలియడం లేదు. రాజరికాన్ని వదులుకున్నాక హ్యరీ రెండుసార్లు బ్రిటన్ లో పర్యటించారు. గత సంవత్సరం ఏప్రిల్ లో తాతయ్య ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు ఓసారి, తల్లి డయానా విగ్రహావిష్కరణకు జులైలో మరోసారి ఇంగ్లండ్ వెళ్లారు. జులై పర్యటనలో ఫొటోగ్రాఫర్ల కారు ప్రిన్స్ హ్యారీ కాన్వాయ్‌ను దాటుకుని పోవడం భద్రత లోపమేనంటూ విమర్శలు వచ్చాయి. భార్య మేఘన, కుమారుడు, కుమార్తె బ్రిటన్ లో పర్యటిస్తే భద్రత ఎలా అని హ్యారీ కోర్టును ఆశ్రయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story