Donald Trump's Brother Dies: డొనాల్డ్ ట్రంప్ సోదరుడి మృతి

Donald Trump's Brother Dies: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెల‌కొంది. అధ్యక్షుడు ట్రంప్ తమ్ముడు రాబర్ట్ స్టువార్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతిచెందారు.

Karampoori Rajesh
Updated on: 16 Aug 2020 12:55 PM IST
Donald Trumps Brother Dies: డొనాల్డ్ ట్రంప్ సోదరుడి మృతి
X
trump

Donald Trump's Brother Dies: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెల‌కొంది. అధ్యక్షుడు ట్రంప్ తమ్ముడు రాబర్ట్ స్టువార్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతిచెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. రాబర్ట్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని డొనాల్డ్‌ ట్రంప్‌కు శ్వేతసౌధం అధికారులు తెలియజేయగా ఆయన శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి తమ్ముడిని పరామర్శించారు. శనివారం నాటికి ఆయ‌న పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

తమ్ముడు రాబర్ట్ మృతి పట్ల ప్రెసిడెంట్ ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు. 'అతడు నా సోదరుడు మాత్రమే కాదు. నా ప్రియ మిత్రుడు. అతడిని ఎంతో మిస్‌ అవుతున్నా. మేం మళ్లీ కలుసుకుంటాం. సోదరుడి జ్ఞాపకాలు నా మదిలో చిరకాలం కదలాడుతూనే ఉంటాయి. రాబర్ట్‌.. ఐ లవ్‌ యూ. రెస్ట్‌ ఇన్‌ పీస్‌' అంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌తో రాబర్ట్‌ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు కలిసి ఎన్నో ఏళ్లపాటు కుటుంబ వ్యాపారం కొనసాగించారు. అమెరికా అధ్యక్షుడు పలు మార్లు తన సోదరుడి గురించి ప్రస్తావించారు. 2016నాటి అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ తరఫున రాబర్ట్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉడిపోయిన రాబర్ట్.. ఈ ఏడాది డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన మేనకోడలు మ్యారీ ట్రంప్ రాసిన 'ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి' పుస్తకానికి వ్యతిరేకంగా న్యాయపోరాటంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. రాబర్ట్ మరణం పట్ల అమెరికా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story