బ్రిటన్ ప్రధాని నోట.. రాముడి మాట...

Arun Chilukuri
Published on: 8 Nov 2020 12:07 PM IST
బ్రిటన్ ప్రధాని నోట.. రాముడి మాట...
X

బ్రిటన్ ప్రధాని నోటి వెంట రాముడు అన్న పదం రావడంతో ఆ మెసేజ్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్రిటన్‌లో మొదటిసారిగా వర్చువల్ దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం కరోనా రూపంలో అతిపెద్ద సవాలు ఉన్నప్పటికీ ప్రజల సంకల్పంపై తనకు విశ్వాసం ఉందని బోరిస్ చెప్పారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుందని దీపావళి పండుగ బోధిస్తున్నట్లుగా మనమంతా కలిసికట్టుగా వైరస్‌పై విజయం సాధిస్తామని చెప్పారు. రావణాసురుడిని ఓడించి సీతారాములు తిరిగి వస్తున్నప్పుడు వారి దారంతా భారీ సంఖ్యలో దీపాలతో వెలిగిపోయిందని మనం కూడా దారిని కనుక్కుంటామని విజయవంతంగా ముందుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంతో ఆయన ప్రసంగం వైరల్ అవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story