Plane Crash: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరో విమాన ప్రమాదం.. మాల్ సమీపంలో కూలిన ఫ్లైట్

Plane Crash: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరో విమాన ప్రమాదం.. మాల్ సమీపంలో కూలిన ఫ్లైట్
x
Highlights

Plane Crash: అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో జరిగిన ఘటన మరువక ముందే మరో ఫ్లైట్ కుప్పకూలిండి. పెన్సిల్వేనియా...

Plane Crash: అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో జరిగిన ఘటన మరువక ముందే మరో ఫ్లైట్ కుప్పకూలిండి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో మినీ విమానం టేకాఫ్ అవుతుండగానే గాలిలోనే పేలిపోయింది. ఈ ఘటనలో ఫ్లైట్ లో ఉన్న ఆరుగురు మరణించారు. విమాన శకలాలు సమీపంలోని ఇళ్లపై చల్లాచదురుగా పడిపోయాయి. విమానంలో ఇద్దరు ఫైలట్లతోపాటు ఇద్దరు డాక్టర్లు ఓ పేషెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా బుధవారం తెల్లవారుజామున వర్జీనియా రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ ఎయిర్ పోర్టుకు సిబ్బందితో కలిసి 64మందితో ఓ విమానం ల్యాండ్ అవుతోంది. ఇదే సమయంలో ఫ్లైట్ పొటోమాక్ నది సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ ఆ ప్యాసింజర్ ఫ్లైట్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో విమాన శకలాలు పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఫ్లైట్ లో ఉన్న 64మంది మరణించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories