Pfizer: ఒమిక్రాన్‌పైనా సత్తా చాటిన ఫైజర్‌ ట్యాబ్లెట్!

Pfizer Antiviral Covid Pill Works On Omicron Variant
x

Pfizer: ఒమిక్రాన్‌పైనా సత్తా చాటిన ఫైజర్‌ ట్యాబ్లెట్!

Highlights

Pfizer: కొవిడ్-19 చికిత్స కోసం తాము ప్రయోగాత్మకంగా రూపొందించిన యాంటీ వైరల్ ట్యాబ్లెట్ కరోనాలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ తెలిపింది.

Pfizer: కొవిడ్-19 చికిత్స కోసం తాము ప్రయోగాత్మకంగా రూపొందించిన యాంటీ వైరల్ ట్యాబ్లెట్ కరోనాలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ తెలిపింది. 2వేల, 250 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఇది ప్రాథమికంగా వెల్లడైందని వివరించింది. ముప్పు అధికంగా ఉన్నవారు లక్షణాలు కనిపించిన వెంటనే దీన్ని తీసుకుంటే ఆస్పత్రిపాటు కావడం, మరణాల బారినపడటం 89 శాతం మేర తగ్గినట్లు వెల్లడైంది. ఈ ఔషధం పొందినవారిలో వైరస్‌ స్థాయి 10 రెట్లు తగ్గినట్లు తేలింది.

విడిగా ల్యాబ్‌లో చేసిన మరో పరీక్షలో ఒమిక్రాన్‌ వేరియంట్‌పైనా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పునరుత్పత్తి కోసం ఈ రకం వైరస్‌ ఉపయోగించే కీలక ప్రొటీన్‌ను కృత్రిమంగా తయారుచేసి, దానిపై ఈ మాత్రను ప్రయోగించినప్పుడు ఈ విషయం వెల్లడైందన్నారు. ఫైజర్‌ మాత్రతోపాటు మెర్క్‌ సంస్థ రూపొందించిన మరో ఔషధాన్ని కొవిడ్‌ చికిత్స కోసం అనుమతిచ్చే అంశంపై ఎఫ్‌డీఏ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది.

కరోనా వైరస్‌లోని మునుపటి వెర్షన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువేనని దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. రెండు డోసుల మేర ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ టీకా పొందినవారికి ఈ వేరియంట్‌ నుంచి 33 శాతం రక్షణ మాత్రమే లభిస్తోందని వెల్లడైంది. అయితే ఈ రకం కరోనా సోకినవారు ఆస్పత్రి పాలు కాకుండా 70 శాతం రక్షణ లభిస్తున్నట్లు తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories