Nasa: : పర్సెవరెన్స్ శాటిలైట్ లాంచింగ్ వీడియో విడుదల

X
నాసా రోవర్ (ఫైల్ ఇమేజ్)
Highlights
Nasa: అంగారకుడిపై దిగిన క్షణాలను వీడియో తీసిన నాసా * రోవర్‌లో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు అమర్చిన ఇంజినీర్లు
Sandeep Eggoju23 Feb 2021 1:21 AM GMT
Nasa: అంగారకుడిపైకి అమెరికా పంపిన పర్సెవరెన్స్ రోవర్ శాటిలైట్ లాంచింగ్ వీడియోను నాసా విడుదల చేసింది. మార్స్ ఉపరితలంపై శాటిలైట్ ల్యాండ్ అయిన క్షణాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. రోవర్ ల్యాండవుతున్న సమయంలో మార్స్‌పై దుమ్ము లేచిపోవడం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 18న ల్యాండ్ అయిన ఈ రోవర్‌లో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లను అమర్చారు. రోవర్ ల్యాండింగ్ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను వినియోగించారు.
Web TitleNasa: Perseverance Satellite Launch Video Release
Next Story