తాలిబన్లకు భారీ షాక్‌.. 450 మందిని కాల్చి చంపిన..

Panjshir: ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకొని విర్రవీగుతోన్న తాలిబన్లకు పంజ్‌షీర్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Updated on: 3 Sept 2021 8:45 PM IST
Panjshir Kills 450 Taliban Fighters
X

తాలిబన్లకు భారీ షాక్‌.. 450 మందిని కాల్చి చంపిన.. 

Panjshir: ఆప్ఘనిస్థాన్ ను ఎలాగోలా ఆక్రమించేసిన తాలిబన్లను పంజ్ షీర్ మాత్రం పంటి కింద రాయిలా తయారైంది. ఆ లోయలోకి అడుగుపెడితే తాలిబన్లకు చుక్కలు చూపిస్తోంది నార్తరన్ అలయెన్స్..తాలిబన్లపై రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తోంది. తాజా దాడిలో 450 మంది తాలిబన్లను ఆప్ఘన్ సైన్యం నిర్దాక్షిణ్యంగా తుద ముట్టించింది.

పంజ్ షీర్ లో అడుగు పెడితే ఖబడ్దార్ అని అమ్రుల్లా సాలేహ్ నేతృత్వంలోని ఆప్ఘన్ సేన తిరగబడుతోంది. తాలిబన్లు అనేక సార్లు పంజ్షేర్ ను ఆక్రమించే ప్రయత్నం చేసినా ప్రావిన్స్ లో అంగుళం కూడా వదులుకోరాదన్న పట్టుదలతో సేనలు అడుగులు వేస్తున్నాయి. పంజ్ షేర్ ను ఆక్రమించాలని ఎవరు ప్రయత్నించినా వారిని నేరుగా నరకానికే పంపుతామని సేనలు హెచ్చరిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story