Pakistan: ఎఫ్‌-16 విమానం భారత్‌ కూల్చలేదు

Pakistan Says F16 Flight is Not Destroyed by India
x

ఎఫ్‌-16 విమానం(ఫైల్ ఫోటో)

Highlights

*ఎఫ్‌-16 కూల్చిన అభినందన్‌కు వీర్‌చక్ర పురస్కారం

Pakistan: పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానం కూల్చివేతపై దాయాది దేశం మళ్లీ పాత పాటే పాడుతోంది. భారత్‌ కూల్చింది ఎఫ్‌-16 కాదంటూ మొదట్నుంచి వాదిస్తున్న పాక్‌ మరోసారి అబద్ధాలు చెబుతోంది. ఆ విమానాన్ని కూల్చిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసిన నేపథ్యంలో పాక్‌ దీనిపై మరోసారి స్పందించింది.

పాక్‌ ఎఫ్‌-16 విమానం కూలిపోయిందన్న వార్తలు బయటకు రాగానే అమెరికా పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాట మార్చిన పాక్‌.. భారత్‌ కూల్చింది ఎఫ్‌-16 విమానం కాదని వెల్లడించింది. తమ దగ్గర ఉన్న ఎఫ్‌-16 విమానాల లెక్క సరిపోయిందని తెలిపింది. అయితే భారత్‌ ఆర్మీ మాత్రం అది ఎఫ్‌-16 విమానమే అని.. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని గట్టిగా చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories