
Rishi Sunak: రిషి మావోడే అంటున్న పాకిస్థానీలు
Gujranwala: పాకిస్థాన్... ఏం చేసినా అది భారత్‌కు వ్యతిరేకంగానే ఉంటుంది.
Gujranwala: పాకిస్థాన్... ఏం చేసినా అది భారత్‌కు వ్యతిరేకంగానే ఉంటుంది. భారత్ ఏదైనా తమదంటే.. కాదు.. తమదని పొరుగు దేశం వాదిస్తోంది. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునక్ మనోడని భారతీయులంతా గర్వపడుతున్నారు. ఈ విషయంలోనూ పాకిస్థాన్ ఎంట్రీ ఇచ్చింది. రిషి భారతీయుడు కాదని పాకిస్థానీయుడని చెబుతోంది. పాకిస్థాన్ చెందిన పలువురు సోషల్ మీడియాలో గుంజన్‌వాలా పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. పాకిస్థానీ హిందువు బ్రిటన్ ప్రధాని అవ్వడం తమకు గర్వకారణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. పాకిస్థాన్ ఈ విషయాన్ని క్లైమ్ చేసుకోవాలని పలువురు పాకిస్థానీ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కానీ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అసలు రిషికి పాకిస్థాన్‌కు ఏం సంబంధం? ఎందుకు గుంజన్‌వాలాను హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రిషి సునక్... బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. భారత దేశాన్ని బ్రిటన్ 200 ఏళ్లకు పైగా పాలించింది. ఇప్పుడు ఆ దేశానికి రిషి సునక్ ప్రధాని కావడంతో భారతీయులంతా గర్వపడుతున్నారు. పైగా రిషి సునక్ హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నారు. అదే కాకుండా భారతదేశానికి చెందిన సాప్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్వయాన అల్లుడు రిషి సునక్. ఆయన కూతురు అక్షతామూర్తిని రిషి సునక్ పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహం కూడా బెంగళూరులో 2009లో వైభవంగా జరిగింది. రిషి పూర్వీకులది భారత్‌లోని పంజాబ్ ప్రాంతమని ఆయన తాతలు కెన్యాలోని నైరోబికి వెళ్లిపోయారు. రిషి తల్లిదండ్రులు యశ్విర్ సునక్, ఉషా ఇంగ్లాండ్‌కు వెళ్లిన తరువాత పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని హ్యాంప్‌షైర్‌లో రిషి సునక్ జన్మించారు. రిషి ఉన్నత విద్యాభ్యాసం అంతా ఇంగ్లాండ్‌లోనే గడిచింది. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రధాని కావడంతో భారతదేశమంతటా హర్షించింది. అయితే ఇక్కడే పాకిస్థాన్ ఎంటరయ్యింది. రిషి సునక్ భారతీయుడు కాదంటూ వాదిస్తోంది. బ్రిటన్ ప్రధానిగా పాకిస్థానీ హిందూ ఎన్నికయ్యారంటూ పాకిస్థాన్ నెటిజన్లు చెబుతున్నారు. గుజ్రాన్‌వాలా పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను పాకిస్థానీలు భారీగా ట్రెండ్ చేస్తున్నారు.
రిషి ప్రధానిగా ఎన్నికైన తరువాత ఆయనను మావోడంటూ పాకిస్థాన్ క్లైమ్ చేసుకుంటోంది. రిషి సునక్ పూర్వీకులది ప్రస్తుత పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన పంజాబీ ఖత్రీ కుటుంబానికి చెందిన వారని పాకిస్థానీలు చెబుతున్నారు. లాహోర్ నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే గుజ్రాన్‌వాలాకు చేరుకునే అవకాశం ఉంది. మంచి ఆహారానికి కుస్తీకి పేరున్న ప్రాంతం గుజ్రాన్‌వాలా. ఈ పట్టణానికి గతంలో ఏడు గేట్లు ఉండేవి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు గుజ్రాన్‌వాలా డౌన్‌టౌన్‌గా పిలుస్తారు. అక్కడ ఇప్పటికీ హిందూ ఆలయాలు, సిక్ గురుద్వారాలు, పాడబడిన ఇళ్లు దర్శనమిస్తాయి. 1930లో మత ఘర్షణల్లో వేలాది హిందువులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. గుజ్రాన్‌వాలాలోని అత్యంత విలువైన తమ ఆస్తులును వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఇదిలా ఉంటే రిషి తాత రాందాస్ సునక్ 1935లో నైరోబీలో ఉద్యోగం రావడంతో గుజ్రాన్‌వాలా ప్రాంతాన్ని విడిచి పెట్టి వెళ్లినట్టు చెబుతోంది. రాందాస్ భార్య సుహాగరాణి 1937లో కెన్యాకు వెళ్లడానికి ముందుకు తన అత్తగారితో కలిసి గుజ్రాన్‌వాలా నుంచి ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. యశ్‌వీర్ సునక్ 1949లో నైరోబిలో యశ్‌వీర్ సునక్ జన్మించారు. ఆ తరువాత 1966లో లివర్‌పూల్‌కు చేరుకున్నారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ లైవర్‌పూల్‌లో మెడిషిన్ చదివారు. 1977లో లైచెస్టర్‌లో ఉషను యశ్‌వీర్ వివాహం చేసుకున్నారు.
అయితే రిషి సునక్ పూర్వీకులది గుజ్రాన్ ప్రాంతం కాబట్టి ఆయన పాకిస్థానీయుడిగా పాక్ నెటిజన్లు చెబుతున్నారు. రిషి సునక్ పాకిస్థాన్‌కు చెందిన హిందువుగా క్లైమ్ చేసుకోవాలంటూ ఆ దేశానికి చెందిన నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బ్రిటన్‌లోని అత్యునత పదవికి పాకిస్థానీ ఎన్నికవడం నిజంగా గర్వకారణమంటూ చెబుతున్నారు. గుజ్రాన్‌వాలా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే పాకిస్థాన్ పేరిట హ్యాష్ ట్యాగ్‌లను వాడుతున్నారు. దేశ విభజనతో హిందువులపై ముస్లింలు భారీగా దాడి చేశారు. కొందరు కట్టుబట్టలతో ప్రాణాలను రక్షించుకునేందుకు పారిపోయి వచ్చారు. అయితే కొందరు మాత్రం ఆస్తులను వదిలేయలేక.. అక్కడే ఉండిపోయారు. వేలాది మంది హిందువులను బలవంతంగా మతమార్పిడులు చేశారు. అక్కడి ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులు, హిందూ మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యమే. పాకిస్థాన్‌లో దాదాపు 75 లక్షల మందికి పైగా హిందువులు ఉంటారు. అత్యధికంగా సింధు రాష్ట్రంలో నివసిస్తున్నారు. తీవ్రవాదుల నుంచి కూడా వేధింపులు ఎదురవుతున్నాయని అక్కడి హిందువులు పేర్కొంటున్నారు.
విషయం ఏదైనా భారత్‌పై బురద చల్లడానికి పాకిస్థాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పైకి ఉసిగొల్పుతోంది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతూ విధ్వంసానికి కుట్రలు పన్నుతోంది. పాకిస్థాన్‌లోని హిందువులను ఏ మాత్రం పట్టించుకోని అక్కడి ప్రజలు రిషి సునక్ పాకిస్థానీ అంటూ చెప్పుకోవడం హాస్యాస్పందంగా ఉందని భారత్‌కు చెందిన నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న హిందువుల సంక్షేమం గురించి ముందు మాట్లాడి ఆ తరువాత రిషి సునక్ గురించి మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. అయినా రిషి సునక్ పూర్వీకులు భారత్‌లో పాకిస్థాన్ భాగంగా ఉన్నప్పుడే దేశం విడిచారని అప్పుడు వారు భారతీయులేనని మరికొందరు పాక్ నెటిజన్లకు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. నిజానికి సునక్‌ను మొదటి నుంచి భారత సంతతికి చెందిన వ్యక్తిగానే చెబుతున్నారు. రిషి సునక్ సైతం తాము భారత సంతతికి చెందిన వారిగానే చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ నుంచి వలస వెళ్లిన కుటుంబాలు కూడా బ్రిటన్‌లో ఉన్నాయి. ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కొందరు ఎంపీలుగా కూడా ఎన్నికయ్యారు. మొత్తంగా రిషి సునక్‌ను తమవాడని పాకిస్థానీయులు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారీగానే ట్రెండ్ చేస్తున్నారు. బ్రిటన్ ప్రధానిగా పాకిస్థానీ అయ్యాడంటూ చెబుతున్నారు. ఇప్పటివరకు రిషి గురించి పట్టించుకోని పాకిస్థానీయులు తాజాగా తమవాడని చెప్పుకోవడం వింతగానే ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



