Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కాలికి సర్జరీ పూర్తి

Imran Khan: లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్

Rama Rao
Published on: 4 Nov 2022 6:30 PM IST
Pakistan Ex PM Imran Khans Leg Surgery is Complete
X

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కాలికి సర్జరీ పూర్తి

Imran Khan: తుపాకీ కాల్పుల్లో గాయపడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని షౌకత్ ఖానుమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుల్లెట్ గాయమైన ఇమ్రాన్ ఖాన్ కాలికి సర్జరీ చేసినట్టు PTI ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. పాక్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇమ్రాన్‌పై పత్యర్థులు పక్కా ప్రణాళికతోనే హత్యకు కుట్ర చేశారని PTI నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలు చేపట్టాలన్న డిమాండ్ ర్యాలీ చేపట్టిన ఇమ్రాన్‌పై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Rama Rao

Rama Rao

Next Story