కశ్మీర్ అంశంపై క్రికెటర్ల మాటల యుద్ధం.. కశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రపోరు ఎటు దారితీయనుంది ?

కశ్మీర్ అంశంపై క్రికెటర్ల మాటల యుద్ధం.. కశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రపోరు ఎటు దారితీయనుంది ?
x
Highlights

ఈ రోజు మాట్లాడుకుందాం కశ్మీర్ అంశంపై క్రికెటర్ల మాటల యుద్ధం గురించి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ యుద్ధం మాటలకే పరిమితం అయ్యేలా లేదు పీఓకే లో...

ఈ రోజు మాట్లాడుకుందాం కశ్మీర్ అంశంపై క్రికెటర్ల మాటల యుద్ధం గురించి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ యుద్ధం మాటలకే పరిమితం అయ్యేలా లేదు పీఓకే లో చైనా సాయంతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్,. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్- బాల్టిస్థాన్ లో ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించడం కశ్మీర్ లో అధికమైపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఇవన్నీ సరిహద్దులో మరోసారి యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

పాకిస్థాన్ - భారత్ క్రికెటర్ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఒకరి తరువాత ఒకరుగా ఫీల్డ్ లోకి వస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ రేపిన చిచ్చు మరింతగా రాజుకుంటోంది.

కరోనాను కట్టడి చేయలేకపోతున్న పాకిస్థాన్ అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చింది. గిల్గిత్ బాల్టిస్థాన్ లో ఎన్నికలు నిర్వహించే ప్రయత్నిం చేస్తోంది. మరో వైపున కశ్మీర్ లో ఉగ్రవాదుల హింసాకాండను ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. నిజానికి పాక్ కోరుకుంటున్నది కూడా అదే. భారత్ ఏదైనా కఠిన చర్య తీసుకునేలా రెచ్చగొడుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఈ విషయంలో గగ్గోలు ప్రారంభించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories