బ్రిటన్ లో మళ్లీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం

బ్రిటన్ లో మళ్లీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం
x
Highlights

బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్లీ పునఃప్రారంభమయ్యాయి...

కరోనా మహమ్మారి కట్టడి కోసం బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ తో ప్రమాదం ఏమి లేదంటూ క్లీన్ చిట్ రావడంతో పరీక్షలు మొదలయ్యాయి. డేటాను స్వతంత్రంగా సమీక్షించిన అనంతరం ట్రయల్స్ పున ప్రారంభించాలని యూకే రెగ్యులేటర్, మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA) సిఫారసు చేసినట్లు ఆక్స్ ఫర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో శనివారం నుంచి ట్రయల్స్ మళ్ళీ ప్రారంభం అయినట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తెలియజేసింది. భారత్ లో కూడా పరీక్షలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ కూడా అధికారిక ప్రకటన చేయనుంది.

కాగా మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను బ్రిటన్ కు చెందిన వాలంటీర్ పై ప్రయోగించగా, తీవ్రమైన సెడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దాంతో వెంటనే ఆక్స్‌ఫర్డ్ మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసింది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. అయితే ఈ ట్రయల్స్ లో పాల్గొన్న రోగి ట్రాన్స్వర్స్ మైలిటిస్ అనే అరుదైన వెన్నెముక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందువల్లే ఆ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడని.. వ్యాక్సిన్ వల్ల కాదని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా కట్టడి చేసుందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందరి దృష్టి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. మూడో దశ ట్రయల్స్ ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories