Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విమర్శల దాడి

Donald Trump: కమలా భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా ?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Aug 2024 7:41 PM IST
Onslaught of criticism in the US presidential election campaign
X

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విమర్శల దాడి

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్‌ మధ్య.. విమర్శల దాడి కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్‌ క్యాండిడేట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శల డోస్‌ను ఇంకాస్త పెంచారు. కమలా భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అని ప్రశ్నించారు. హారిస్‌ భారతీయురాలని తనకు తెలుసు కానీ.. ఇప్పుడు ఆమె హఠాత్తుగా నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. దీనికి కొనసాగింపుగా తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో కమలా హారిస్‌కు చెందిన ఓ ఫొటోను షేర్‌ చేశారు.

చాలా ఏండ్ల క్రితం మీరు మంచి ఫొటోను షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు, భారతీయ వారసత్వం పట్ల మీ ఆప్యాయత, స్నేహం, ప్రేమ ప్రశంసించదగినవి అంటూ వ్యాఖ్యానించారు. అమెరికాలోని నల్ల జాతీయుల ఓట్లను ఆకర్షించడానికి కమలా హరీస్.. తాను నల్లజాతీయురాలిగా చెప్పుకుంటుందోనే అర్థం వచ్చేలా.. ట్రంప్ ఆమెను విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story