శ్రీలంకలో పెట్రో ఎమర్జెన్సీ.. ఒక్కరోజుకు సరిపడా నిల్వలే ఉన్నాయన్న..

Only One Day of Petrol Stock Left in Sri Lanka
x

శ్రీలంకలో పెట్రో ఎమర్జెన్సీ.. ఒక్కరోజుకు సరిపడా నిల్వలే ఉన్నాయన్న..

Highlights

Sri Lanka Crisis: శ్రీలంకలో పెట్రోలు నిల్వలు పూర్తిగా అడుగంటాయి.

Sri Lanka Crisis: శ్రీలంకలో పెట్రోలు నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే బంకుల్లో నిల్వ ఉంది. ఈ షాకింగ్ న్యూస్ స్వయంగా దేశ ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు. ఇదివరకే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. పెట్రోల్ పరిస్థితీ అంతే. ఈ ఏడాది ఆరంభం నుంచే శ్రీలంకలో పెట్రోల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. తాజాగా వాహనదారులపై మరో పిడుగులాంటి వార్త పేల్చారు ప్రధాని విక్రమ సింఘే. ఈ గడ్డు స్థితి నుంచి గట్టేక్కాలంటే పొరుగు దేశాల నుంచి పెట్రోల్ ను యుద్ధప్రాతిపదికన దిగుమతి చేసుకోవాల్సిందే. భారత్ ఇదివరకే భారీ ఎత్తున పెట్రోల్ ను శ్రీలంకకు ఎగుమతి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories