US President Elections: కమలా హారిస్ అమెరికాకు అద్భుతమైన ప్రెసిడెంట్ అవుతారన్న ఒబామా

US President Elections: కమలా హారిస్ అమెరికాకు అద్భుతమైన అధ్యక్షురాలు అవుతారని మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 26 July 2024 3:54 PM IST
Image Credit: x/barrack obama
X

Image Credit: x/barrack obama

US President Elections: కమలా హారిస్ అమెరికాకు అద్భుతమైన అధ్యక్షురాలు అవుతారని మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అన్నారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు ఒబామా, ఆయన భార్య మిషెల్లి ఒబామా చెప్పారు. ఈ జంట స్వయంగా కమలా హారిస్ కు ఫోన్ చేసి దాదాపు ఒక నిమిషం మాట్లాడారు. ఆ వీడియో బయటకు వచ్చింది.

“అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మీకు మద్దతు ఇస్తున్నామని తెలపడానికి మేమిద్దరం గర్వపడుతున్నాం. ఈ ఎన్నికల్లో మీ విజయానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తాం” అని ఒబామా ఫోన్లో కమలా హారిస్ కు చెప్పారు.

“ఈ మధ్యే మా స్నేహితురాలు కమలా హారిస్ కు నేను, మిషెల్లి ఫోన్ చేశాం. ఆమె అమెరికాకు అద్భుతమైన అధ్యక్షురాలు అవుతారని భావిస్తున్నామని చెప్పాం. మా పూర్తి మద్దతు తనకు ఉంటుదని కూడా హామీ ఇచ్చాం. నవంబర్ నెలలో జరిగే ఎన్నికల్లో ఆమె విజయం సాధించేందుకు అన్ని విధాలా సహకరిస్తాం. మీరందరూ కూడా మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం” అని ఒబామా ట్వీట్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story