Macedonia: నైట్ క్లబ్‌లో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

North Macedonia Club Fire Breaks Video: నార్త్ మాసిడోనియాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైట్ క్లబ్‌లో మంటలు చెలరేగడంతో 50 మంది వరకు మృతి చెందారు. వందలాది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

Shiva
Updated on: 16 March 2025 4:54 PM IST
Macedonia: నైట్ క్లబ్‌లో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్
X

Macedonia: నైట్ క్లబ్‌లో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

North Macedonia Club Fire Breaks: నార్త్ మాసిడోనియాలోని కొకాణీ పట్టణంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కేవలం 30,000 మంది జనాభా కలిగిన ఈ చిన్న పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ క్లబ్‌లో రాత్రి కచేరీ నిర్వహించారు. దీనికి దాదాపు 1500 మందికి పైగా యువకులు హాజరయ్యారు అని తెలుస్తుంది. ఆదివారం తెల్లవారుజాము సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంటే ఉదయం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. డీఎంకే హిప్‌ హప్‌ ప్రదర్శన నేపథ్యంలో చాలామంది హాజరయ్యారు.

కొన్ని పత్రిక నివేదికల ప్రకారం ఇప్పటికే వందలాది మంది స్థానిక ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన ప్రాంతానికి స్థలానికి చేరుకొని డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు.

నార్త్ మాసిడోనియాలో జరిగిన ఈ అరుదైన ఘటన వల్ల దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎక్కువమంది యువకులు ఈ కచేరీకి హాజరవడంతో తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. సోషల్ మీడియా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

అయితే ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ముందుగా క్లబ్‌ సీలింగ్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్లబ్ మొత్తం ఆ మంటలు వ్యాపించాయి. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో క్లబ్ కు వచ్చిన వారు ఉరుకుల పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో తీవ్ర గందరగోళం జరిగింది. ఒక్కసారిగా తొక్కిసలాట కూడా జరిగిందని తెలుస్తోంది.

నార్త్ మాసిడోనియా ప్రధాన మంత్రి జాన్ మిక్సోకి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అన్ని విధాల వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక చనిపోయిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు.



Shiva

Shiva

Next Story