Nobel Prize 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డులు

Nobel Prize 2022: 2022 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ బహుమతి వరించింది.

Arun Chilukuri
Published on: 4 Oct 2022 8:18 PM IST
Nobel Physics 2022 To Be Awarded To These 3 Scientists
X

Nobel Prize 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డులు

Nobel Prize 2022: 2022 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ బహుమతి వరించింది. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అవార్డును ప్రకటించింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు... బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు... క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story