కరోనా 2.O : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్తరకం కరోనా

కరోనా 2.O : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్తరకం కరోనా
x
Highlights

ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ప్రపంచానికి కరోనా మళ్లీ స్ట్రోక్ ఇచ్చింది. బ్రిటన్‌లో కొత్త రూపు దాల్చుకుని దడ పుట్టిస్తోంది. గతంలో సోకిన వైరస్ కంటే కొత్త...

ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ప్రపంచానికి కరోనా మళ్లీ స్ట్రోక్ ఇచ్చింది. బ్రిటన్‌లో కొత్త రూపు దాల్చుకుని దడ పుట్టిస్తోంది. గతంలో సోకిన వైరస్ కంటే కొత్త కరోనా వేరియంట్ 70శాతం వేగంగా వ్యాపిస్తుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలన్నీ మళ్లీ ఆం‌క్షల వలయంలో చిక్కుకుపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

సరిగ్గా ఏడాది క్రితం చైనాలో మొదలైంది కరోనా. అప్పటినుంచి ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో ఉంచింది. ఏడున్నర కోట్ల మందికి పాకిన వైరస్..17 లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. దాంతో కొవిడ్ స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్ ను అణిచే టీకాలు వస్తున్నాయని ప్రపంచదేశాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో కాస్త కొత్త రూపు దాల్చుకున్న కరోనాతో జనాల్లో మళ్లీ వణుకు మొదలైంది.

బ్రిటన్‌లో మొదలైన కొత్తరకం కరోనా వ్యాప్తి 70శాతం అధికంగా ఉండటం కలవరపెడుతోంది. ఇప్పటికైతే దీనితో ప్రాణాపాయం ఉందనే విషయమేదీ వెల్లడి కాలేదు. కానీ వేగంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటు సౌతాఫ్రికాలో కూడా మరో రకం కరోనా వైరస్ బయటపడటంతో జనం భయంతో వణికిపోతున్నారు.

కొత్త రకం కరోనా బ్రిటన్‌లో పంజా విసురుతోంది. 60శాతం కొత్త కేసులు ఈ రకం వైరస్‌వే కనిపిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి పలు దేశాలు. దాదాపు నలభై దేశాలు యూకే నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి. సరిహద్దు దేశాలు అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించాయి. ఇక ఓ వైరస్‌లో ఇన్ని మార్పులు రావటం చరిత్రలో ఇదే తొలిసారి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు కరోనాలో 17 రకాల మార్పులు జరిగాయన్నారు. కొత్త రకం కరోనా కేసుల్లో 86 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని వెల్లడించారు.

బ్రిటన్‌లో తాజా పరిణామాలతో అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆదివారం నుంచి ఇక్కడ లాక్‌డౌన్ కూడా అమలవుతోంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వైరస్‌ గురించి పూర్తిగా తెలిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories