America: జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

America: పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ ను దోషిగా తేల్చిన కోర్టు

Sandeep Eggoju
Updated on: 21 April 2021 11:19 AM IST
New Twist in George Floyd Death Case
X

జార్జ్ ప్లాయిడ్ (ఫైల్ ఇమేజ్)

America: అగ్రరాజ్యం అమెరికాలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నియాపాలిస్ తీర్పు వెలువరిచింది. పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. త్వరలోనే నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్నట్టు ధర్మాసనం తెలిపింది. డెరెక్ అప్పీల్ చేసుకున్న బెయి‌ల్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

తీర్పు వెలువడిన అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తీర్పు చెప్పే సమయంలో మాస్క్‌తో ఉన్న డెరెక్ ముఖంలో ఎలాంటి భావోగ్వేగాలు కనిపించలేదు మరోవైపు కోర్టు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ ఎత్తున బలగాలు మోహరించాయి..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story