Sinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..

Mysterious sinkhole opens up in Chile
x

Sinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..

Highlights

Sinkhole: ఈ గొయ్యిని జాగ్రత్తగా పరిశీలించండి.. ఎవరో చాలా శద్ధతో తవ్వినట్టుగా కనిపిస్తోంది కదూ.. కానీ.. దాన్ని ఎవ్వరూ తవ్వలేదు రాత్రికి ఏర్పడిన వింత గొయ్యి అది.

Sinkhole: ఈ గొయ్యిని జాగ్రత్తగా పరిశీలించండి.. ఎవరో చాలా శద్ధతో తవ్వినట్టుగా కనిపిస్తోంది కదూ.. కానీ.. దాన్ని ఎవ్వరూ తవ్వలేదు రాత్రికి ఏర్పడిన వింత గొయ్యి అది. అది ఎలా ఏర్పడిందో అంతు చిక్కడం లేదు. దీనిపై భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. చిలీలో ఏర్పడిన ఈ గొయ్యి ఎలా ఏర్పడిందనేది కూపీలాగేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. ఈ గొయ్యికి సమీపంలో గనులు ఉండడంతో వాటి కారణంగానే ఏర్పడి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయినా కూడా గొయ్యి పడితే మరీ అంత చక్కగా ఎవరో తవ్వినట్టుగా ఎలా పడుతుందనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.

చిలీలోని టియెరా అమరిల్లా నగరానికి సమీపంలోని అల్కపెర్రోసాలో రాగి గనులు ఉన్నాయి. ఈ గనులకు సమీపంలోనే ఈ వింత గొయ్యి ఏర్పడింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజు రోజుకు ఆ గొయ్యి పెరుగుతున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. మొదట్లో 82 అడుగుల వెడల్పుతో 105 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. ఇప్పుడది 82 అడుగుల వెడల్పుతో 656 అడుగుల లోతుకు పెరిగింది. సమైక్యతకు చిహ్నంగా గుజరాత్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని అందులో పెడితే పూర్తిగా కూరుకుపోతుంది. అంతలా ఈ గొయ్యి ఏర్పడింది. ప్రస్తుతం దీని చుట్టూ 100 మీటర్ల పరిధిలో చిలీ ప్రభుత్వం కంచెను ఏర్పాటు చేసింది. గొయ్యి విషయం తెలుసుకుని దాన్ని చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. అయితే ఈ గొయ్యి వల్ల సమీపంలోని మైనింగ్‌కు ఎమైనా ప్రమాదం ఏర్పడుతుందా? అనే కోణంలో అక్కడి అధికారులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఈ గొయ్యిలో నీరు ఉబికి వస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. నీటిని తోడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ గొయ్యితో ఇప్పటివరకు అటు మైనింగ్‌, ఇటు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అల్కపెర్రోసా గనుల్లో కెనడాకు చెందిన లుండింగ్‌ మైనింగ్‌ ఎల్‌యూఎన్‌ కంపెనీ, జపాన్‌కు చెందిన సుమిటోమో మెటల్‌ మైనింగ్‌ కంపెనీలు పని చేస్తున్నాయి. గొయ్యి ఏర్పడిన తరువాత ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు లేవని మైనింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచంలోనే రాగిని ఉత్పత్తి చేస్తున్న దేశం చిలీ ప్రపంచ అవసరాలకు 25 శాతం రాగి చిలీ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఈ గనుల్లో 80 శాతం వాటా కెనడా కంపెనీకి 20 శాతం వాటా జపాన్‌ కంపెనీకి ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగానే మైనింగ్‌ కంపెనీలు తవ్వకాలు చేపట్టినట్టు చిలీ చెబుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories