Maldives: మాల్దీవ్స్ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ మరోసారి విజయం

Maldives: 66 చోట్ల PNC పార్టీ గెలుపు

Shashank Gullapelli
Published on: 22 April 2024 8:07 PM IST
Muizzu Party Wins Again In Maldives Elections
X

Maldives: మాల్దీవ్స్ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ మరోసారి విజయం

Maldives: మాల్దీవ్స్ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ పార్టీ మరోసారి విజయం సాధించింది. ఏప్రిల్ 21న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. ముయిజూ పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 93 స్థానాలున్న పార్లమెంట్ ఎన్నికల్లో 90 చోట్ల పోటీ చేసింది పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్. అందులో 66 చోట్లు PNC పార్టీ గెలుపొందింది. సభలో మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. భారత్‌కి దూరంగా ఉంటున్న ముయిజూ చైనాకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఆయన పార్టీ ఈ స్థాయిలో గెలుపొందడం కీలకంగా మారింది. ఇకపై భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేందుకు దీన్నే మంచి అవకాశంగా భావిస్తోంది ఆ పార్టీ. ఇప్పటికే ముయిజూ చైనాకి దగ్గరవడం ఇబ్బందికరంగా మారింది. పైగా మాల్దీవ్స్‌లోని భారత సైనికులు వెనక్కి వెళ్లిపోవాలంటూ ముయిజూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story