Spain: ఎంపీలను పరుగులు పెట్టించిన ఎలుక

Spain: స్పెయిన్ పార్లమెంట్‌ను ఓ మూషికం పరుగులు పెట్టించింది.

Arun Chilukuri
Published on: 22 July 2021 9:05 PM IST
MPs Jump to Their Feet as rat Enters Parliament in Spain
X

Spain: ఎంపీలను పరుగులు పెట్టించిన ఎలుక

Spain: స్పెయిన్ పార్లమెంట్‌ను ఓ మూషికం పరుగులు పెట్టించింది. స్పెయిన్‌లోని సెవిల్‌లో ఉన్న ఆండలూసియా పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్లమెంట్‌లో సీరియస్‌గా మాట్లాడుతున్న స్పీకర్ మార్తా బోస్కెట్ ఆ ఎలుకను చూసి షాక్‌ తిన్నారు. అది గమనించిన మిగిలిన సభ్యులు కూడా సీట్లల నుంచి లేచి పరుగులు తీశారు. అనంతరం కాసేపటికి ఎలుకను బయటకు తోలేయగా ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులై ఉండి ఎలుకను చూసి భయపడడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story