Ukrainian model: శరీరం విరిగిపోయింది.. రక్తంతో కొట్టుమిట్టాడుతోంది.. 10 రోజులుగా ఉక్రెయిన్ మోడల్ మిస్సింగ్!

Ukrainian model
x

Ukrainian model: శరీరం విరిగిపోయింది.. రక్తంతో కొట్టుమిట్టాడుతోంది.. 10 రోజులుగా ఉక్రెయిన్ మోడల్ మిస్సింగ్!

Highlights

Ukrainian model: దుబాయ్‌లో మిస్సింగ్ అయిన ఉక్రెయిన్ మోడల్ తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన కనిపించడంతో గూఢచర్యం అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

Ukrainian model: దుబాయ్‌లో 10 రోజులుగా మిస్సింగ్ అయిన 20ఏళ్ల ఉక్రెయిన్ మోడల్ మారణాంతిక స్థితిలో రోడ్డుపక్కన కనిపించింది. ముఖంగా శరీరం విరిగిపోయిన స్థితిలో బయటపడిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. మార్చి 9న ఓ హోటల్‌లో జరిగే ప్రైవేట్ గ్యాదరింగ్‌కి వెళ్తున్నట్టు తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తర్వాత తాను థాయిలాండ్‌కి వెళ్లాల్సిన విమానాన్ని కూడా ఎక్కకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది.

మార్చి 12న రోడ్డుపక్కన తీవ్ర గాయాలతో ఆమె కనిపించిన సమయంలో స్పైనల్ కార్డ్ విరిగిపోయిన పరిస్థితి, అనేక అవయవాలు విరిగినట్లుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా... ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఇప్పటికే నాలుగు సర్జరీలు జరిగాయి. ఆమె తల్లి నార్వే నుంచి వచ్చి ఆసుపత్రిలో ఉన్న ఆమెను చూసుకుంటున్నారు.

ఈ ఘటనపై దుబాయ్ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోడల్ ఓ నిషేధిత నిర్మాణ స్థలంలో పడి గాయపడ్డట్టుగా ప్రాథమికంగా గుర్తించామని, ఇతర ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు నిర్ధారించకముందే ఊహాగానాలు నమ్మవద్దని పోలీస్ విభాగం వెల్లడించింది. కానీ బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రష్యన్ మీడియా నివేదికల ప్రకారం ఆమెను దినాల తరబడి దారుణంగా వాడుకున్న తర్వాత రోడ్డుపక్కన పడేసినట్టు కుటుంబం భావిస్తోంది.

ఆమె మోడలింగ్ రంగానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఆ రాత్రి గడపాలని భావించి వెళ్లిందని, చివరిగా అదే రోజు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందిందని వెల్లడవుతోంది. దీంతో ఈ మొత్తం ఘటనపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని బలాత్కారంగా పరిగణించి ప్రచారం చేయొద్దని.. బాధితురాలి గోప్యతను గౌరవించాలని మీడియాలో విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories