Miss Universe: గుర్రపు స్వారీ చేస్తూ మిస్ యూనివర్స్ ఫైనలిస్టు మృతి

Miss Universe: ఆస్ట్రేలియా మోడల్ సియానా వేర్ దుర్మరణం

Jyothi
Published on: 6 May 2023 10:48 AM IST
Miss Universe Finalist Sienna Dies following Horse-Riding Accident
X

Miss Universe: గుర్రపు స్వారీ చేస్తూ మిస్ యూనివర్స్ ఫైనలిస్టు మృతి

Miss Universe: 2022 లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో ఫైనల్ దాకా వెళ్లిన అందాల భామ అర్ధాంతరంగా కన్నుమూసింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులకు పైనే లైఫ్ సపోర్ట్ పై ఆసుపత్రి బెడ్ మీద మృత్యువుతో యుద్ధం చేసిన యువతి 23 ఏళ్లకే కన్నుమూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్యాషన్ మోడల్, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియానా వేర్ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.

మూడేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ చేస్తున్న సియాన.. గత నెలలో ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్ లో గుర్రంపై పరుగులు తీస్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా పరిగెత్తుతున్న గుర్రం అకస్మాత్తుగా కిందపడిపోయింది. దీంతో సియానాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. సియానా ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండడంతో లైఫ్ సపోర్ట్ ఏర్పాటు చేశారు.. నెల రోజుల తర్వాత కూడా ఆమె కోలుకోకపోవడంతో వైద్యుల సలహాతో లైఫ్ సపోర్ట్ నిలివేశారు.

Jyothi

Jyothi

Next Story