Australia: ఆస్ట్రేలియాలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత

Millions Of Fishes Have Died In Australia
x

Australia: ఆస్ట్రేలియాలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత

Highlights

Australia: న్యూ సౌత్‌వేల్స్‌లోని డార్లింగ్ నదిలో భయానక దృశ్యాలు

Australia: ప్రకృతి ప్రకోపానికి మనుషులేకాదు.. మూగజీవాలు బలవుతున్నాయి. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫాను, భూకంపాలతో ప్రాణకోటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ నదిలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్ట్రేలియాలో రెండో పొడవైన నదిగా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపంలోగల డార్లింగ్‌ నది పేరు గాంచింది. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని సిడ్నీకి పశ్చిమాన వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నదిలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర చేపలు నిర్జీవంగా తేలియాడుతున్న దృశ్యాలే. వరద నీరు తగ్గడం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్‌ శాతం పడిపోవడమే భారీ స్థాయిలో చేపల మృత్యువాతకు కారణమని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories