US Military Strike: ఇరాన్ లో టెన్షన్ టెన్షన్..యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా..ఏ క్షణమైనా దాడి?

Donald Trump
x

US Military Strike: ఇరాన్ లో టెన్షన్ టెన్షన్..యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా..ఏ క్షణమైనా దాడి?

Highlights

US Military Strike: ఇరాన్ పై సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతోందా.

US Military Strike: ఇరాన్ పై సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతోందా. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు అమెరికా సీనియర్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో చర్చలు కీలక దశకు చేరాయి. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదొక వారాంతంలో అమెరికా దాడి చేసే అవకాశం ఉందని సమాచారం. తుది తేదీపై మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది.

వాల్ స్ట్రీట్ కధనం ప్రకారం..ఇరాన్ పై మిలిటరీ దాడి ప్లాన్ కు అమెరికా అధ్యక్షుడుట్రంప్ గతంవారమే అంగీకారం తెలిపారు. ఇరాన్ తన డిమాండ్స్ తలొగ్గవచ్చనే అంచనాతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఈ వాదనకు బలం చేకూరేలా ట్రంప్ బుధవారం కీలక ప్రకటన చేశారు. మేము దాడి చేయవచ్చు..చేయకపోవచ్చు. ఇదియుద్ధం . మార్పులు వేగంగా జరుగుతాయి. చివరి క్షణంలో నేను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని అన్నారు. మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికాతో డీల్ కు ఇరాన్ అంగీకరించి ఉండాల్సిందన్నారు. చివరిలో వాళ్లు డీల్ కు నో చెప్పారు. అలా చేసి ఉండకపోతే బాగుండేదని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారన్నారు.

ఇరాన్ లోని అణుస్థావరాలపై దాడులకు ట్రంపు సుముఖంగా ఉన్నట్లు ఏబీసీ న్యూస్ తెలిపింది. ఒకేసారి బహుళ స్థావరాలపై అమెరికా దాడులు చేసే అవకాశంఉంది. దాడిప్రణాళికకు ట్రంప్ మంగళవారం ఒకే చెప్పారు. తదుపరి 24గంటల్లో దాడులు చేసే ఛాన్స్ ఉందని అప్పట్లో విశ్వసనీయ వర్గాలుతెలిపాయి.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లాఅలీ ఖమేనీ బుధవారం స్పందించారు. మిలిటరీ చర్యలకు దిగినట్లయితే అమెరికా కోలుకోలేని పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా దాడులకు పాల్పడితే ఆ ప్రాంతాల్లోని అగ్రరాజ్య స్థావరాలపై తాము ప్రతి దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఖమేని హెచ్చరికలను ట్రంప్ ఖాతరు చేయలేదు. ఇరాన్ కు గుడ్ లక్ అంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్ కు అణ్వాయుధాన్ని దక్కనీయమని ఎప్పటి నుంచో నేను ఇదే చెబుతున్నాను. ఈ విషయంలో ప్రస్తుతం మరింత సీరియస్ గా ఉన్నానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories