Satya Nadella Son: మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూత

Satya Nadella Son: పుట్టుకతోనే కండరాల వ్యాధితో బాధపడుతున్న జైన్ నాదెళ్ల

Rama Rao
Published on: 1 March 2022 1:26 PM IST
Microsoft CEO Satya Nadella Son Passed Away| Telugu Online News
X

 మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూత

Satya Nadella Son: అమెరికాలోని వాషింగ్టన్ లో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల కన్ను మూశారు. పుట్టుకతోనే కండరాల వ్యాధితో బాధపడుతున్న 26ఏళ్ల జైన్ నాదెళ్ల ఆరోగ్యం విషమించి మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జైన్ నాదెళ్ల కన్నుమూశారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడిస్తూ జైన్‌ మృతికి సంతాపం ప్రకటించింది.

సత్య నాదెళ్ల, అను దంపతుల పెద్ద కుమారుడు జైన్‌ 1996లో జన్మించాడు. అయితే జైన్‌ తీవ్రమైన సెరెబ్రల్‌ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి అతడు వీల్‌ ఛెయిర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. దీంతో సత్య నాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని తన కొడుకు లాంటి వారికోసం వినూత్న పరికరాలపై నాదెళ్ల దృష్టిపెట్టారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగవైకల్యం ఉన్నవారు కూడా సులువుగా ఉపయోగించుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story